కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2020 10:39 AM GMT
కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

అమరావతి: ఏపీ కేబినెట్‌ భేటీ కొద్దిసేప‌టి క్రితం ముగిసింది. మూడున్న‌ర గంట‌ల‌పాటు సాగిన‌ ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అన్ని రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా చిరు వ్యాపారులకు ఇచ్చే జగనన్న చేదోడు పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు. దీంతో పాటుగా 6 మెడికల్‌ కాలేజీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్‌ కాలేజీకి 35 ఎకరాలు కేటాయించారు. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపారు. దీంతో.. రూ.5,835 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది.

ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై కూడా ఈ సందర్భంగా చర్చించింది. ఈ నెల 24 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్ఈబీ పరిధిని విస్తరించాలని కేబినెట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఎస్‌ఈబీ పరిధిలోకి ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ సహా వివిధ జూదాలు, డ్రగ్స్, గంజాయిని నిరోధించే బాధ్యతలు ఎస్‌ఈబీకి అప్పగించారు. కాగా భేటీ అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

Next Story
Share it