చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు

YSRCP MLA Anil Kumar Yadav flays TDP, Jana Sena over alliances. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి

By Medi Samrat  Published on  13 May 2022 10:06 AM GMT
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో పర్యటించిన అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు, పవన్ కుమార్‌లు నేరుగా సీఎం జగన్‌ను ఎదుర్కోలేక పొత్తుల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరి పొత్తుల గురించి ఆందోళన చెందడం లేదన్న ఆయ‌న‌.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు వారిపై వారికి నమ్మకం లేదని అన్నారు.

పొత్తుల గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు వల్ల జగన్ మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా ఉంటారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి అందరూ భయపడుతున్నారని, ఆయనను ఎదుర్కోలేక పోతున్నారని విప‌క్షాల‌నుద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ అరెస్టుపై రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. పాత వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తుంద‌ని.. ఓ వర్గం మీడియాను అనిల్ కుమార్ యాదవ్ తప్పుబట్టారు.
Next Story
Share it