పవన్‌ను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు : సజ్జల

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు

By Medi Samrat
Published on : 13 Dec 2023 5:50 PM IST

పవన్‌ను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు : సజ్జల

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా పట్టించుకోలేదని.. ఎల్లో మీడియానే టీడీపీని, చంద్రబాబును నడిపిస్తోంది. వారు పగటి కలలు కంటున్నారు. అదే కలలు కంటూ అలాగే వారు భ్రమల్లో ఉండాలని కోరుకుంటున్నాం. వై నాట్ 175 అనే లక్ష్యంతోనే మేము పని చేస్తున్నాం. జగన్ ఏం తప్పు చేస్తారా? ఎలా చిల్లర రాజకీయాలు చేద్దామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. 2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారన్నారు సజ్జల. జగన్ వచ్చాక ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నారన్నారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ప్రజల ఎకానమీ దెబ్బతినలేదని అన్నారు సజ్జల. ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకుని చంద్రబాబు ఒక భ్రమలో బతుకుతున్నారని.. పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అందరినీ జగన్ దగ్గర చేసుకున్నారన్నారు. ఒకచోట టికెట్ ఇవ్వలేకపోతే మరోచోట కేటాయిస్తాం.. అధినేత మాట కాదని ఎవరూ ఉండరని సజ్జల వివరించారు.

Next Story