2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత, 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా: జగన్

జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ ఇస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు

By -  Knakam Karthik
Published on : 28 Jan 2026 6:28 PM IST

Andrapradesh, Tadepalli, Ysrcp, Jagan, Tdp, Cm Chandrababu, Ap Government

2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత, 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా: జగన్

తాడేపల్లి: జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ ఇస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. బుధవారం తాడేపల్లిలో భీమవరం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. క్రితంసారి కొవిడ్‌ వల్ల పాలనపై ఎక్కువ ఫోకస్ పెట్టానని, 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. ఇక ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పిన ఆయన 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తాని ప్రకటించారు. సీఎం చంద్రబాబు తప్పుడు పాలనను ప్రజలకు వివరించి, ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా పార్టీనేతలు చొరవ చూపాలి అని జగన్ పేర్కొన్నారు.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గపు పాలన చేస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ వర్గానికీ మంచి జరగలేదని జగన్ విమర్శించారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలుగా తేలాయి. రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుల్లోకి అది వెళ్తోంది. మద్యంలో ప్రైవేటు షాపుల్ని తెరిపించి తన మనుషులతో సీఎం చంద్రబాబు నడిపిస్తున్నారు. బెల్టు షాపుల్ని సైతం వేలం వేసి అమ్మారు. పోలీసులతో వీటిని దగ్గరుండి నడిపిస్తున్నారు..అని జగన్ ధ్వజమెత్తారు.

Next Story