ఏపీలో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని సీఎం వైఎస్ జగన్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినట్టు తెలిపారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామని అన్నారు. అలాగే.. అక్టోబర్‌లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేసినట్టు వెల్లడించారు.
రైతులకు ఎంత చేసినా తక్కువేనని..18 నెలల్లోనే 90 శాతానికిపైగా హామీలు నెరవేర్చామని.. ఏ సీజన్‌లో పంట నష్టపోతే.. అదే సీజన్‌లో రైతులను ఆదుకుంటున్నాం. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నామని.. అర్హత ఉండి అందకపోతే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని.. ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపినట్టు సీఎం పేర్కొన్నారు. అలాగే.. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్ అన్నారు.