టీటీడీ నెయ్యి టెండర్లలో భారీ గోల్‌మాల్..వైసీపీ సంచలన ట్వీట్
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
By - Knakam Karthik |
టీటీడీ నెయ్యి టెండర్లలో భారీ గోల్‌మాల్..వైసీపీ సంచలన ట్వీట్
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇందాపూర్ డెయిరీ తయారు చేసిన సోనాయ్ నెయ్యిని బహిరంగ మార్కెట్‌లో లీటరు రూ.560కే విక్రయిస్తుండగా, టీటీడీకి మాత్రం రూ.658కి సరఫరా చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొంది. దాదాపు 10 లక్షల కిలోల నెయ్యి టెండరులో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని విమర్శించింది.
ఈ ఇందాపూర్ డెయిరీ, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌తో కో-మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా సంబంధాలు కలిగి ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోందని ట్వీట్ చేసింది. కేవలం తన వ్యక్తిగత లాభం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని మండిపడింది. ఆలయాల విషయంలో చంద్రబాబుకు మొదట డబ్బు, తర్వాత రాజకీయం, చివరగా మాత్రమే భక్తుల సెంటిమెంట్లు అని ధ్వజమెత్తింది. ఈ టెండర్ ప్రక్రియపై తక్షణమే నిజాలను ప్రజల ముందు ఉంచాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది.
🚨 Exposed 🚨Sonai ghee manufactured by Indapur Dairy was supplied to Tirumala Tirupati Devasthanam at Rs 658 per Kg. However, available invoices indicate that the same product was sold in the open market at around Rs 560 per litre. The people of the state deserve a clear… pic.twitter.com/Unjgwy8TwU
— YSR Congress Party (@YSRCParty) February 23, 2026