జగన్ బాటలో చంద్రబాబు నడుస్తున్నారట.!

ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలకు పేర్లు మార్చడంపై చర్చ జరుగుతూ ఉంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల స్పందించారు

By Medi Samrat  Published on  31 Aug 2024 1:00 PM GMT
జగన్ బాటలో చంద్రబాబు నడుస్తున్నారట.!

ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలకు పేర్లు మార్చడంపై చర్చ జరుగుతూ ఉంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల స్పందించారు. ఎన్టీఆర్ అయినా, వైఎస్ఆర్ అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లే. పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే. రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదన్నారు వైఎస్ షర్మిల.

"వైద్య,విద్యా సంస్థలకు NTR పేరు తొలగించి మాజీ సీఎం @ysjagan జగన్ గారు అనాడు పెద్ద తప్పు చేస్తే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి @ncbn గారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు,ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి YSR పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోంది. NTR అయినా, YSR అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లే. పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే. రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదు. YSR అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్,రుణమాఫీ,ఉచిత కరెంట్,పెన్షన్లు, ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శం. YSR ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదు.. తెలుగు వారి ఆస్తి. తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం ఈనాటికీ పదిలం. YCP మీద ఉన్న కోపాన్ని YSR మీద రుద్దడం సరికాదు. YCPలో YSR లేడు. అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయి రెడ్డి పార్టీనే." అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

Next Story