రేపు తిరుపతికి సీఎం జ‌గ‌న్‌

YS Jagan to tour Tirupati tomorrow. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు

By Medi Samrat  Published on  4 May 2022 6:26 PM IST
రేపు తిరుపతికి సీఎం జ‌గ‌న్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి 11.05 గంటలకు తిరుపతి ఎస్వీ వెటర్నరీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అనంతరం 11.20 గంటలకు ఎస్వీ యూనివర్శిటీ స్టేడియానికి చేరుకుని 'జగనన్న విద్యా దీవెన' కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు.

టీటీడీలో పిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించిన భూమిపూజలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన టాటా క్యాన్సర్ కేర్ సెంటర్ (శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ హాస్పిటల్)కి వెళ్లి కొత్త ఆసుపత్రిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.25 గంటలకు ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.









Next Story