ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదు

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదని, ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

By Medi Samrat
Published on : 2 April 2025 8:42 PM IST

ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదు

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదని, ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయని, వైసీపీ పాలనలో ఏదో ఒక బటన్‌ నొక్కేవాళ్లమని అన్నారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన నాయకులను వైఎస్ జగన్ అభినందించారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నానన్నారు.

Next Story