ట్రూత్ బాంబ్‌ను పేల్చిన వైసీపీ

వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక ప్రకటన చేసింది

By Medi Samrat  Published on  24 Oct 2024 3:00 PM IST
ట్రూత్ బాంబ్‌ను పేల్చిన వైసీపీ

వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ఒక కీలక ప్రకటన చేసింది. మీడియా అధినేత ముసుగులో డ్రగ్స్ మాఫియాను నడుపుతున్న వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీలో కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా X లో పోస్ట్‌ చేసింది. ఇటీవలి సంవత్సరాలలో, ఓ ఎల్లో న్యూస్ ఛానెల్ అధిపతి 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడంటూ తెలిపారు.

"మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్‌ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!" అంటూ పోస్టు పెట్టింది.

ఏ చిన్న బాబు కోసం అన్ని వందల కాల్స్ చేశావ్ ఎల్లో మీడియా అధిపతి? అంటూ మరో ట్వీట్ లో వైసీపీ అధికార ట్విట్టర్ అకౌంట్ లో ప్రశ్నించారు.


"దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. గుట్టు చప్పుడు కాకుండా 13 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్ని భ్రష్టుపట్టిస్తున్న ఎల్లో డ్రగ్స్ మాఫియా" అంటూ పోస్టు పెట్టారు. "గత కొన్నేళ్లుగా 15 మందితో వందలాది డ్రగ్స్ సంబంధిత చర్చలు.. ఇలాంటి వాడికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడితే.. తిరుమల పవిత్రతని కాపాడతాడా?" అంటూ ప్రశ్నించారు.

Next Story