తిరుపతి వైసీపీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కూటమి ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించారు. మేయర్ డాక్టర్ శిరీష, మహిళలు టికెట్ అడిగితే నా పేరు చెప్పండనే సీఎం చంద్రబాబు వీడియోను చూపుతూ నినాదాలు చేశారు. ఆరు గ్యారెంటీల అమలు చేయలేదని చెబుతూ.. ఫ్రీ బస్ అయినా ఇవ్వు బాబు అంటూ నినాదాలు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఆర్టీసీ బస్సులో నిరసన వ్యక్తం చేశారు. అయితే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ కండక్టర్ స్పష్టం చేశాడు. ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వీ యునివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.