వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..?

YCP MLC Anantha Babu Arrest Issue. డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కథనాలు

By Medi Samrat  Published on  23 May 2022 6:23 AM GMT
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..?

డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. కేసు నుంచి తప్పించుకునేందుకు అనంతబాబు చాలా ప్రయత్నాలే చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే పోలీసులు అనంతబాబుపై హత్య కేసు నమోదు చేశారు. హత్య కేసుకు సంబంధించి అనంతబాబు అనుచరులు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కొట్టిచంపినట్లు ఎమ్మెల్సీ అనుచరులు చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.

సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికలో సుబ్రహ్మణ్యంను చాలా దారుణంగా కొట్టి చంపినట్టు తెలుస్తోంది. తలపై బలంగా మోదారు. చేతులు విరిచేశారు. ప్రైవేట్‌ పార్ట్స్‌పై బలంగా కొట్టారు. గొంతు నొక్కడంతో ఊపిరి ఆగిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఐదేళ్లపాటు డ్రైవర్ గా పనిచేసిన యువకుడ్ని దారుణంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాయి. ఈనెల 20న రాత్రి 7.30కి అనంతబాబు అనుచరుడు మణికంఠతో కలిసి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడు. 12.30కి ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యం తల్లికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ చేశాడు. 1.30కి వాళ్ల తమ్ముడు నవీన్ కి అనంత బాబు కాల్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్లు అతడు చనిపోయాడని చెప్పారు.










Next Story