క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
YCP Mla Undavalli Sridevi. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
By Medi Samrat Published on 31 Dec 2021 3:15 PM GMTరాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం అయింది. అంబేద్కర్ వల్ల ఏ హక్కులు పొందలేదని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమండ్రిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి బాబు జగ్జీవన్ రామ్ వల్లే మాదిగలు హక్కులు సాధించుకోగలిగారని అన్నారు. ఈ దుమారంపై ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తాను అంబేద్కర్ ను విమర్శించలేదని అన్నారు. అంబేద్కర్ ను తాను దూషించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
కొందరు వ్యక్తులు కావాలనే తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసిన వీడియోలు ప్రసారం చేశారని వివరణ ఇచ్చారు. ఆ వీడియోలు చూసి ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే తనను క్షమించాలని ఉండవల్లి శ్రీదేవి కోరారు. రాజ్యాంగ నిర్మాతను దూషించాననడం అవాస్తం. చిన్న నాటి నుంచి అంబేద్కర్ వాదినే. కొందరు ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మార్ఫింగ్, ఎడిటింగ్ చేసిన వీడియోలను వైరల్ చేస్తున్నారు. వాటి వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలి. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ దళితులకు రెండు కళ్ల లాంటివారు. మార్ఫింగ్ వీడియోతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు.