పవన్ కళ్యాణ్, బాలకృష్ణల‌పై వైసీపీ ఫిర్యాదు

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేశారని

By Medi Samrat  Published on  16 April 2024 11:15 AM IST
పవన్ కళ్యాణ్, బాలకృష్ణల‌పై వైసీపీ ఫిర్యాదు

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వారిపై చర్యలు తీసుకో­వాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశారు.

ఏప్రిల్ 13న కదిరి బహిరంగ సభలో నందమూరి బాలకృష్ణ, 14న తెనాలి నియోజకవర్గంలో పవన్‌ కళ్యాణ్‌ ఎన్నిక కోడ్‌కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన విజువల్స్ ను ఎన్నికల సంఘానికి ఇచ్చారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనాడు దినపత్రిక ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కథనాలు రాస్తోందని.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహరరెడ్డి సోమవారం సీఈవో ముఖేష్‌ కుమార్‌మీనాను కలిసి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఆధారాలు సమర్పించారు.

Next Story