ఆ ఎయిర్‌పోర్టుకు 2014-2019లోనే పనులు ప్రారంభించాం..మోదీ సహకారానికి థ్యాంక్స్: సీఎం చంద్రబాబు

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014-19 మధ్య ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ప్రణాళికలు రచించి, పనులు ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు

By -  Knakam Karthik
Published on : 4 Jan 2026 3:36 PM IST

Andrapradesh, Vishakapatnam, Bhogapuram International Airport, Cm Chandrababu, Bjp, Pm Narendra Modi

ఆ ఎయిర్‌పోర్టుకు 2014-2019లోనే పనులు ప్రారంభించాం..మోదీ సహకారానికి థ్యాంక్స్: సీఎం చంద్రబాబు

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014-19 మధ్య ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ప్రణాళికలు రచించి, పనులు ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కొత్త మైలురాయి అని అభివర్ణించారు.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో వచ్చే జూన్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారానికి, ఆయన దార్శనికతకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. భోగాపురం విమానాశ్రయంలో విమాన రాకపోకలకు సంబంధించి నిర్వహించిన వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Next Story