విషాదం : ఇద్దరు పిల్లలతో సహా త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

Woman along with her two children ends life in Srikakulam. శ్రీకాకుళంలో విషాదం చోటుచేసుకుంది. పుట్టింటికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన‌ భర్త.. తన నివాసంలో

By Medi Samrat  Published on  1 March 2022 1:27 PM IST
విషాదం : ఇద్దరు పిల్లలతో సహా త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

శ్రీకాకుళంలో విషాదం చోటుచేసుకుంది. పుట్టింటికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన‌ భర్త.. తన నివాసంలో భార్యాపిల్లలు చనిపోయి ఉండటాన్ని చూసి షాక్‌కు గుర‌య్యాడు. ఈ సంఘటన అనకాపల్లి శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన జనార్దన్ కు తన అక్క కూతురు అనూష(24)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు సుదీక్ష (5), గీత అన్విత (ఏడాదిన్నర) ఉండగా.. జనార్దన్‌కు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆరు నెలలుగా అనకాపల్లి జాతీయ రహదారి పక్కనే అనకాపల్లి-ఉమ్మలాడ రోడ్డు అచ్యుతాపురంలో అద్దెకు ఉంటున్నారు.

కాగా, జనార్దన్ శనివారం శ్రీకాకుళంకు వెళ్లాడు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తన సోదరుడితో కలిసి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండగా.. భార్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉంది. ఇది గమనించిన భర్త జనార్దన్ భార్యను కిందకు దించగా.. అతని సోదరుడు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. డీఎస్పీ బి.సునీల్, పట్టణ సీఐ లంక భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి అనూష రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ సునీల్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇంటి యజమాని వేధింపులకు తన భార్య మనస్తాపం చెంది.. ఈ దారుణానికి పాల్పడిందంటూ జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story