ఏపీలోని పలు ప్రాంతాల్లో గాలివాన భీభత్సం

Windstorm in many parts of AP. ఆంధ్రప్రదేశ్‌లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఆకాశం మేఘావృతమే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది

By Medi Samrat  Published on  28 May 2023 6:50 PM IST
ఏపీలోని పలు ప్రాంతాల్లో గాలివాన భీభత్సం

ఆంధ్రప్రదేశ్‌లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఆకాశం మేఘావృతమే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. తిరుపతి జిల్లాలోని కొరమీను గుంటలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కొన్ని నిమిషాల పాటూ భీభత్సం సృష్టించింది. ఏమి జరుగుతోందో కూడా ప్రజలకు తెలియకుండా పోయింది. ఈ వర్షం దాటికి 20కి పైగా రేకుల ఇళ్లు కూలిపోయాయి.

రాజమండ్రిలో సైతం భారీ వర్షం పడుతోంది. రాజమండ్రిలో టీడీపీ నిర్వహిస్తోన్న మహానాడు సభ ప్రాంగణం వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో మహానాడు సభకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాలుల దాటికి సభ ప్రాంగణంలో ఫ్లెక్సీలు, కటౌట్‌లు కూలిపోయాయి. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలిరావడంతో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, చిత్తూరు, బైరెడ్డిపల్లితో పాటు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


Next Story