నల్లధనాన్ని తెల్లధనం చేసుకోడానికి ఇలాంటి సదస్సులను ఉపయోగించుకున్నారు

We are setting up a pavilion in Davos on behalf of Andhra Pradesh. దావోస్ సదస్సులో ఏపీ ప్రత్యేకతలు, ప్రాధాన్యతలను వివరించడం ద్వారా రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం

By Medi Samrat  Published on  18 May 2022 4:24 PM IST
నల్లధనాన్ని తెల్లధనం చేసుకోడానికి ఇలాంటి సదస్సులను ఉపయోగించుకున్నారు

దావోస్ సదస్సులో ఏపీ ప్రత్యేకతలు, ప్రాధాన్యతలను వివరించడం ద్వారా రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉందని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఈ విష‌య‌మై విశాఖపట్నంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 22న జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు ఏపీ ప్రతినిధులు హాజరవుతారని మంత్రి తెలిపారు. దావోస్‌లో మొత్తం 18 అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. సుమారు 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు రానున్నాయని తెలిపారు.

గ‌త ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నల్లధనాన్ని తెల్లధనం చేసేందుకు ఇలాంటి సదస్సులు పెట్టారని ఆరోపించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతలను చెబుతూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు ఒక అవకాశంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అభివర్ణించారు. దావోస్ సదస్సు వేదికపై ఏపీ తరపున పెవిలియన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.










Next Story