Alert : తుఫాను ప్రభావిత ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాల నిలిపివేత

తుపాను ప్రభావం రాష్ట్రంలోని కృష్ణ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ,అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుందని ఆర్ టి జి ఎస్ హెచ్చరికలు జారీ చేసింది.

By -  Medi Samrat
Published on : 28 Oct 2025 7:13 PM IST

Alert : తుఫాను ప్రభావిత ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాల నిలిపివేత

తుపాను ప్రభావం రాష్ట్రంలోని కృష్ణ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ,అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుందని ఆర్ టి జి ఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడు జిల్లాలలో ఈరోజు రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఆయా జిల్లాలనుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. అయితే, అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని సూచించింది. ఆయా జిల్లాల్లోని ప్రజలంతా ఇండ్ల లోనే ఉండాలని, బయటకు రావద్దని, అప్రమత్తతతో మెలగాలని సూచించింది.

Next Story