ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Union Minister Kishan Reddy Visits AP. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆశీర్వాద్ యాత్రలో బాగంగా ఏపీలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

By Medi Samrat  Published on  19 Aug 2021 10:02 AM GMT
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆశీర్వాద్ యాత్రలో బాగంగా ఏపీలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట‌గా ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి.. ఆపై గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. ఇక్కడి కార్యకర్తలతో నాకు పరిచయం ఉందని.. రిక్షాలో పార్టీ కార్యాలయానికి వచ్చిన గుర్తుంద‌ని అన్నారు. కాశ్మీర్ కోసం పార్టీ పనిచేసిందని అన్నారు. 370 ఆర్టికల్ తొలగిస్తామని పార్టీ స్థాపించినప్పటి నుండి హామీ ఇచ్చామ‌ని.. జిన్నా తీసుకుని వచ్చిన ఆర్టికల్ 370ని రద్దు చేసామ‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో నేను హోం శాఖ సహాయ మంత్రిగా ఉండడంతో నా జీవితం ధన్యమైందని అన్నారు.

ఈ నెల చాలా ముఖ్యమైంద‌ని.. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైందని.. ఎన్నో ఆకాంక్షలతో స్వాతంత్ర్యం తెచ్చుకోవడం జరిగిందని తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందని.. ఢిల్లీలో లాబీయింగ్ లేని పాలన నరేంద్ర మోదీ నిర్వహిస్తున్నారని అన్నారు. జాతీయ రహదారులు కేవలం బీజేపీ ద్వారా సాధ్యమైందని.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.

దేశంలో 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఆహార చట్టబద్రత చట్టం కింద ఇస్తున్నామ‌ని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ అందించడం జరుగుతోందని స్ప‌ష్టం చేశారు. ప్రపంచ దేశాలకంటే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ మనదేశానికి అందించారని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టే.. ప్రజలను సంఘటితం చేసి కరోనాను ఎదుర్కొన్నామ‌ని అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం అమలు చేస్తోందని.. రైతులకు సంవత్సరానికి ఆరువేల రూపాయలు వారి అకౌంట్‌లో వేస్తున్నామ‌ని తెలిపారు.


Next Story