నెత్తురోడిన ర‌హ‌దారులు.. ఇద్ద‌రు మృతి.. మ‌రో ఇరువురికి తీవ్ర గాయాలు

Two dead and several injured in a couple of accidents in Bapatla and Krishna districts. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, కృష్ణా జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా

By Medi Samrat
Published on : 23 Aug 2022 5:28 PM IST

నెత్తురోడిన ర‌హ‌దారులు.. ఇద్ద‌రు మృతి.. మ‌రో ఇరువురికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, కృష్ణా జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాపట్ల జిల్లా జె పంగులూరు మండలం కొండ మంజులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చంద్రగిరి నుంచి చిలకలూరిపేట వైపు టీడీపీ నాయకులు వెళ్తున్న కారు మార్గమధ్యలో లారీని ఢీకొనడంతో చంద్రగిరి మండల టీడీపీ యూత్ అధ్యక్షుడు భాను ప్రకాష్(31) మృతి చెందాడు. తిరుపతి జిల్లా టీడీపీ కార్యదర్శి గంగుపల్లి భాస్కర్ గాయపడ్డారు. మ‌రో ఘ‌ట‌న‌లో కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొనడంతో ఏపీ జెన్‌కో ఉద్యోగి వర ప్రసాద్‌ భార్య మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.




Next Story