ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు.