అన్ని కూరగాయలు ఉన్నా.. టమాటాలు మాత్రమే చోరీ చేసిన దొంగలు..!

Tomatoes are the only thieves who stole in krishna. కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులోని ఓ కూరగాయల షాపులోరాత్రి దొంగలు పడ్డారు. టమాటాలను దొంగతనం చేశారు.

By అంజి  Published on  28 Nov 2021 9:17 AM IST
అన్ని కూరగాయలు ఉన్నా.. టమాటాలు మాత్రమే చోరీ చేసిన దొంగలు..!

టమాటాలు సామాన్యుడు కొనుగోలు చేయనంతగా ఖరీదైనదిగా మారిపోయింది. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో టమాటాల ధరలు పలుకుతున్నాయి. ప్రస్తుతం కూరగాయల మార్కెట్లలో టమాటాకు డిమాండ్‌ భారీగా ఉంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు.. కూరగాయల రేట్లను అమాంతం పెంచేశారు. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులోని ఓ కూరగాయల షాపులో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. టమాటాలను దొంగతనం చేశారు. అయితే దుకాణంలో అన్ని రకాల కూరగాయలు ఉన్నప్పటికీ దొంగలు మాత్రం కేవలం 3 టమాటా పెట్టెలు మాత్రమే చోరీ చేశారు.

శనివారం తెల్లవారుజామున షాపు తెరిచిన వ్యాపారి పెనుగొండ సూరి.. తన షాపులోని టమాటాలు దొంగతనానికి గురైన విషయాన్ని గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో తన టమాటా పెట్టెలు చోరీ అయిన విషయాన్ని ఫిర్యాదు చేశాడు. ఒక్కోక్క టమాటా పెట్టెకు రూ.2 వేలు పెట్టి ఖమ్మం జిల్లా నుండి తెచ్చానని పెనుగొండ సూరి తెలిపారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలోని మాత్రం టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. ములకల చెరువు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కిలో టమాటా రూ.20 పలికింది. 30 కిలోల టమాట పెట్టె రూ.600కు అమ్ముడుపోయింది. రెండు రోజుల కిందట ఇదే మార్కెట్‌లో 30 కిలోల టమాటా పెట్టె రూ.3 వేల రికార్డు ధర పలికింది. అయితే తాజాగా పక్క రాష్ట్రాల నుండి పలువురు కూరగాయల వ్యాపారులు టమాటా స్టాక్‌ను పెద్ద ఎత్తున తీసుకురావడంతో భారీగా ధర తగ్గింది.

Next Story