తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి సినీ హీరో మంచు విష్ణు అండగా నిలిచారు. సాయితేజ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మంచు విష్ణు మాట్లాడారు. సాయితేజ పిల్లలకు తమ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ వరకు చదవిస్తానని మంచు విష్ణు అన్నారు. కాగా హీరో మంచు విష్ణు.. సాయి తేజ్ కుటుంబానికి అండగా నిలవడం పట్లు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రముఖులు లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి అండగా నిలబడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాయితేజ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. సాయితేజ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
భారత సైన్యానికి చెందిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి మృతి చెందిన వారిలో సాయితేజ కూడా ఉన్నాడు. చిత్తూరు జిల్లా కురుబలకోట వాసి అయిన సాయితేజ ఈ ప్రమాదంలో అసువులు బాసాడు. లాన్స్ నాయక్ హోదాలో సాయితేజ్ రావత్ పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. సాయితేజ్ భార్యతో చివరిసారిగా బుధవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సాయితేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్.