త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న తిరుప‌తి లోక్‌స‌భ ఉపఎన్నిక‌కు టీడీపీ అభ్య‌ర్థిని ఖ‌రారుచేసింది. వైకాపాకు చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందడంతో ఈ ఉపఎన్నిక జరగనుంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నేడు తిరుప‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో టీడీపీ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ఖరారు చేశారు. ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు.

ఉపఎన్నికల్లో తెలుగుదేశం గెలుపునకు కృషి చేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై టీడీపీ కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మినే మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు. అభ్య‌ర్థి విజ‌యం కోసం శ్రేణులంతా క‌ష్టించి ప‌నిచేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.


సామ్రాట్

Next Story