తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్‌ డెడ్‌

తిరుపతి-శ్రీకాళహస్తి హైవేపై గురువారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

By అంజి  Published on  1 Jun 2023 11:19 AM IST
Telangana, road accident, Tirupati, Crime news

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు స్పాట్‌ డెడ్‌ 

హైదరాబాద్: తిరుపతి-శ్రీకాళహస్తి హైవేపై గురువారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద తిరుపతి నుంచి తెలంగాణ వెళ్తున్న కారు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో దంపతులు, వారి బిడ్డ అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఏర్పేడు సీఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దివాన్‌పల్లెకు చెందిన వెంకటమ్మ, అశోక్, సంచారిగా గుర్తించారు. తిరుమల వెంకటేశ్వర ఆలయంలో దర్శనం ముగించుకుని తిరుపతి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే కారు డ్రైవర్ అతివేగంగా కారు నడుపుతూ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story