ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు రానున్నాయి. ఈ జిల్లాల ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. నూతనంగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్షించిన ముఖ్యమంత్రి కొన్ని మార్పుచేర్పులకు ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు
రంపచోడవరం, చింతూరు డివిజన్లను కలపకుండా కొత్త జిల్లా ఏర్పాటు చేయడమే మంచిదని మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం సూచనలు చేశారు. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరికొన్ని సూచనలు సీఎం చేశారు. సీఎం సూచనలకు అనుగుణంగా మరో నివేదికతో మంత్రివర్గ ఉప సంఘం రూపొందించనుంది.