నెల్లూరులో ఘోర రోడ్డుప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

Three dead as lorry hits an auto in Gudur of Nellore district. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చెడిమళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో

By Medi Samrat
Published on : 17 Feb 2022 4:57 PM IST

నెల్లూరులో ఘోర రోడ్డుప్ర‌మాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చెడిమళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చింతవరం నుంచి గూడూరు వైపు వెళ్తున్న ఆటోను వరగలి క్రాస్ రోడ్డు నుంచి చింతవరం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. లారీ ఆటోను కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లి నుజ్జునుజ్జు చేసింది. గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ సుధాకర్‌ కారులో ఇరుక్కుని మృతి చెందగా.. మరో ఇద్దరు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు.

మృతులు గూడూరు మండలం చెన్నూరు దళితవాడకు చెందిన మాతంగి రాజశేఖర్, హరిసాయి ఓ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం కంపెనీకి చెందిన సరుకులను షాపులకు చేర్చి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మృతుల‌ బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story