64 కళల్లో దొంగతనం కూడా ఒక కళ అని చెబుతుంటారు. అయితే దొంగతనం చేయడం అంత సులువైన విషయేమీ కాదు. అయితే దొంగతనం చేయడం అనైతికం, చట్ట వ్యతిరేకమం. దొంగతనం చేయడం నేరం అని తెలిసినా కొందరు దొంగతనాలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ ఏటీఎంలోని సీసీ కెమెరాలకు రంగులు పూసి దొంగతనానికి పాల్పడిన ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. నగర సమీపంలోని రెండు చోట్ల ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడ్డారు దండుగుల. ఏటీఎంలలో ఉన్న రూ.41 లక్షల డబ్బును చోరీ చేశారు. సోమవారం రాత్రి చింతకొమ్మదిన్నె మండలంలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలకు.. దుండుగులు నల్లని రంగు పూశారు. ఆ వెంటనే గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను తెరిచారు. రూ.17 లక్షలు అపరించారు.
మంగళవారం నాడు చోరీని గుర్తించిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంజినేయపురంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు. ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో తెరిచి రూ.24 లక్షలు దోచుకెళ్లారు దొంగలు. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాలను గాలించారు. కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీకి 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఓ కారు కాలిపోయి కనబడింది. అయితే ఆ కారుకు చోరులకు సంబంధముందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.