ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఎరువుల కొరత లేదని..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎరువుల నిల్వలు, వినియోగంపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రైవేట్ కంపెనీలలో, సహకార సంస్థలలో ఎరువులు సరఫరా అయ్యేలా ప్రణాళికలు చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్ కు 16.76 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయింపు జరిగింది.
కో ఆపరేటివ్ సొసైటీ, రైతు సేవా కేంద్రాలు, మార్క్ ఫెడ్ గోదాములు, రిటైల్/హోల్ సెల్ కంపెనీ గోదాముల ద్వారా రైతులకు అందచేస్తున్నాం. రైతులకు ఎరువుల కొరత అంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కడా లేదు...సీజన్ కు సరిపడా నిరంతరం ఎరువుల సరఫరా కొనసాగుతుంది. రైతు ప్రయోజనాలే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది..అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.