ల్యాప్‌టాప్ పేలి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తీవ్రగాయాలు

Techie injured severely as her laptop exploded due to short circuit in Kadapa. వైఎస్ఆర్ కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారి గ్రామంలో ల్యాప్‌టాప్ పేలి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

By Medi Samrat  Published on  18 April 2022 7:46 PM IST
ల్యాప్‌టాప్ పేలి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తీవ్రగాయాలు

వైఎస్ఆర్ కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారి గ్రామంలో ల్యాప్‌టాప్ పేలి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సుమలత (22) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ సోమవారం ఉదయం వర్క్ ఫ్రమ్ హోమ్‌గా పనిచేస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంచంపై కూర్చుని పని చేస్తున్న సుమలత విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకుంది. మంచానికి కూడా మంటలు అంటుకున్నాయి.

గదిలో నుంచి పొగలు రావడంతో కుటుంబ సభ్యులు గ‌మ‌నించి సుమలతను వెంట‌నే చికిత్స నిమిత్తం కడప సన్‌రైజ్‌ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్క‌డి నుండి ఆమెను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 80 శాతం కాలిన గాయాలతో యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తీవ్ర‌గాయాల పాలైన‌ సుమలత బెంగళూరులోని మ్యాజిక్ టెక్ సొల్యూషన్‌లో పనిచేస్తున్నారు.










Next Story