మహిళా టీచర్‌ స్థానంలో విధులకు హాజరై.. పాఠాలు చెబుతూ అడ్డంగా దొరికిన టీచర్‌ భర్త

Teacher found attending to duties in place of wife‌. మహిళా టీచర్‌ స్థానంలో విధులకు హాజరై.. పాఠాలు చెబుతూ అడ్డంగా దొరికిన టీచర్‌ భర్త

By అంజి  Published on  13 Dec 2021 2:40 PM IST
మహిళా టీచర్‌ స్థానంలో విధులకు హాజరై.. పాఠాలు చెబుతూ అడ్డంగా దొరికిన టీచర్‌ భర్త

అనంతపురం జిల్లాలో భార్య స్థానంలో ప్రభుత్వ పాఠశాలలో విధులకు హాజరై దొరికపోయాడు ఓ ఉపాధ్యాయుడు. పాఠశాలకు వచ్చి పాఠాలు చెప్పాల్సిన మహిళా టీచర్‌ రాలేదు. అయితే ఆ స్థానంలో విధులు నిర్వర్తించేందుకు ఆమె భర్త హాజరయ్యాడు. ఓ పాఠశాలలో ప్రభుత్వ మహిళా టీచర్‌ భర్త ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడ విధులకు వెళ్లకుండా.. భార్య స్థానంలో విధులు నిర్వర్తించారు. ఎంఈవో తనిఖీలో ఈ విషయం బయటపడింది. దీంతో మహిళా టీచర్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. అలాగే మహిళా టీచర్‌ భర్తపై చర్యలకు సిఫారసు చేశారు. కదిరి పట్టణంలోని రాణీనగర్‌ మునిసిపల్‌ పాఠశాలలో రమేష్‌ తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

ఓడీ చేరువు మండలం టి.కుంట్లపల్లి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా రమేష్‌ భార్య అరుణాదేవీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 7 నుండి 9 వరకు అరుణాదేవి సెలవు పెట్టారు. తిరిగి 10వ తేదీన విధులు హాజరుకావాల్సి ఉండేది. కానీ కాలేదు. ఆ రోజు టీచర్‌ అరుణాదేవి వస్తారనే ఉద్దేశంతో హెడ్‌మాస్టర్‌ సునీత సెలవు తీసుకున్నారు. కానీ టీచర్‌ అరుణాదేవి స్థానంలో భర్త రమేష్‌ విధులకు హాజరయ్యి.. విద్యార్థులకు పాఠాలు బోధించాడు. ఎంఈవో చెన్నక్రిష్ట ఆకస్మిక పాఠశాలలో తనిఖీ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. అధికారులు డీఈఓకు నివేదిక పంపడంతో అరుణాదేవిని సస్పెండ్‌ చేశారు. ఆమె భర్తపైనా చర్యలు తీసుకోవాలని కదిరి మునిసిపల్‌ కార్యాలయానికి సిఫారసు చేశారు.

Next Story