ఢిల్లీకి టీడీపీ బృందం.. మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ

TDP Leaders Visit For Delhi To Meet President Kovind. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి టీడీపీ నేతల బృందం

By Medi Samrat
Published on : 25 Oct 2021 9:25 AM IST

ఢిల్లీకి టీడీపీ బృందం.. మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి టీడీపీ నేతల బృందం నేడు ఫిర్యాదు చేయనున్నారు. దీని కోసం చంద్రబాబుతో పాటు మొత్తం 18 మంది ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్​మెంట్ ఖరారు కాగా.. ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించి.. రాష్ట్రపతి పాలన విధించాలనే అజెండాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలో పార్టీ బృందం రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించటంతో పాటు.. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవనున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కొవిడ్‌ దృష్ట్యా చంద్రబాబు సహా ఐదుగురికే అనుమతి లభించింది. మాదకద్రవ్యాలకు, గంజాయి సాగుకు ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రంగా మార్చిందని.. ప్రభుత్వంలోని పెద్దలే వీటిని ప్రోత్సహిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి టీడీపీ ఫిర్యాదు చేయనుంది. టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీలు, కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలు.. ఈ ఉదయం 6 గంటలకు చంద్రబాబుతో కలిసి హైదరాబాద్‌ నుంచి నుండి ఢిల్లీ బ‌య‌లుదేరారు.


Next Story