రోడ్డుప్రమాదంలో టీడీపీ నేత మృతి
TDP Leader Dead In Road Accient. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు గ్రామ శివారులోని జాతీయ
By Medi Samrat Published on 20 April 2022 12:29 PM GMTజోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు గ్రామ శివారులోని జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టీడీపీ నాయకుడు రాజవర్ధన్ రెడ్డి మృతిచెందారు. ప్రమాదం నుండి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా ఒక్కసారిగా రెండు టైర్లు పగిలి పల్టీలు కొడుతూ కారు హైవే కిందకు దూసుకెళ్లింది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో రాజవర్ధన్ రెడ్డి తండ్రి.. విష్ణువర్ధన్ రెడ్డికి సొంత అనుచరవర్గం ఉంది. గెలుపు, ఓటములను ప్రభావితం చేయగల ప్రజల మనిషిగా పేరు పొందారు. రాజవర్ధన్ రెడ్డికి నారా లోకేష్ అనుచరుడిగా పేరుంది. రాజవర్ధన్ రెడ్డి మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దొమ్మన రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. రాజవర్ధన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/hPjpP3JSqs
— N Chandrababu Naidu (@ncbn) April 20, 2022
ఇదిలావుంటే.. గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో టిడిపి నేత విష్ణువర్థన్ రెడ్డి కుమారుడు రాజవర్దన్ రెడ్డి మృతిచెందడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాజవర్థన్ రెడ్డి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తూ ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ఆత్మస్థయిర్యం కలిగించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.