చంద్ర‌బాబుకు ఐటీ నోటీసులపై టీడీపీ నేతల వెర్షన్ విన్నారా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు రావడంపై

By Medi Samrat  Published on  2 Sep 2023 9:59 AM GMT
చంద్ర‌బాబుకు ఐటీ నోటీసులపై టీడీపీ నేతల వెర్షన్ విన్నారా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు రావడంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ నోటీసులపై చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించలేదు. ఈ ఐటీ నోటీసుల‌పై వైసీపీ నేతలు శునాకానదం పొందుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా విమర్శించారు. చంద్రబాబు నీతి నిజాయితీపై వైసీపీ ప్రభుత్వం బురదజల్లుతుందని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు ట్రాన్సాక్షన్ జరగని ఈ కేసులో ఐటీ ఇచ్చిన నోటీసులకు చట్టబద్దత, విలువ లేదని అన్నారు. ఐటీ ఇచ్చిన నోటీసుల వెనుక వైసీపీ లాబీయింగ్ చేసిందని ఆరోపించారు. చంద్రబాబు ఇమేజ్‌ని తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించారు. డబ్బు ఎక్కడా చేతులు మారనప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చే అవసరం ఏముందని ప్రశ్నించారు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల నుంచి పొందిన రూ.118 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని కలిగి ఉన్నందుకు చంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఐటీ సెంట్రల్ సర్కిల్ జారీ చేసిన షోకాజ్ నోటీసులలో.. ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్నటువంటి షాపూర్‌ జీ పల్లోంజి కంపెనీ ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పలు కాంట్రాక్ట్‌లు దక్కించుకుంది. అదే సమయంలో ఈ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్‌లు అప్పగించిన సంస్థల నుంచి కిక్‌ బాక్స్‌ రూపంలో 118 కోట్ల రూపాయలు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబుకు అందినట్లుగా ఐటీ నోటీసుల్లో తేలింది. దీనిపైనే ఐటీ అధికారులు సెక్షన్‌163C కింద షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Next Story