తెలుగు దేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై.. నేడు శ్రీకాకుళం జిల్లా సోంపేట కోర్టులో విచారణ జరగనుంది. అయితే కేసు డైరీని పోలీసులు సమర్పించకపోవటంతో ఈ రోజుకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు జిల్లా జైలులో ఉన్న అచ్చెన్నను పోలీసు కస్టడీకి కోరుతూ కోటబొమ్మాళి పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై కూడా నేడు కోటబొమ్మాళి కోర్టులో విచారణ జరగనుంది.

జనవరి 31న నిమ్మాడ నామినేషన్‌ కేంద్రం వైసీపి, టిడిపి వర్గీయుల మధ్య వివాదం కేసులో అచ్చెన్నాయుడు అరెస్టు అయ్యారు.పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి.. నామినేషన్ల విషయంలో వైసీపీ, టిడిపి నేతల మధ్య తలెత్తిన వివాదం కేసులో... అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు.
సామ్రాట్

Next Story