ఏపీకి వ‌ర్ష సూచ‌న‌.. రాబోయే మూడు రోజులు..

Synoptic features of Weather Inference for AP. ఉత్తర బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి.మీ నుండి 5.8 కి.మీ

By Medi Samrat  Published on  26 July 2021 9:39 AM GMT
ఏపీకి వ‌ర్ష సూచ‌న‌.. రాబోయే మూడు రోజులు..

ఉత్తర బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. దీని ప్రభావము వలన జూలై 28 తేదీన ఉత్తర బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాల‌కులు తెలిపారు. దీని కార‌ణంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుండి గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంల‌లో ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈ రోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.


Next Story
Share it