సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి స్వల్ప ఊరట

Supreme court stay on ap high court judgement. అమరావతిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

By Medi Samrat
Published on : 28 Nov 2022 5:23 PM IST

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి స్వల్ప ఊరట

అమరావతిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నెల రోజుల్లో కొన్ని పనులు, మరో 6 నెలల్లో ఇంకొన్ని పనులు చేయాలన్న కాలపరిమితులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది.

అమరావతి అంశంలో వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, తీర్పులో మరికొన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అమరావతి వ్యవహారానికి సంబంధించి ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 31 లోపు తప్పనిసరిగా జవాబు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.


Next Story