ప్ర‌ముఖ తెలుగు న్యూస్‌ ఛానల్‌ ఏబీఎన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏబీఎన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం రఘురామకృష్ణరాజుతో పాటు ఏబీఎన్‌, టీవీ5పై ఏపీ సీఐడీ న‌మోదు చేసిన‌ కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసును సీఐడీ దర్యాప్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

అయితే.. దర్యాప్తు పూర్తయ్యేవరకు తీవ్ర చర్యలు వద్దని పేర్కొంది. అనంత‌రం విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలా? వద్దా? అన్నది అప్పుడు విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీం ఆర్డ‌ర్‌ నేఫ‌థ్యంలో ఏపీ సీఐడీ విచార‌ణ కొన‌సాగ‌నుంది. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ జ‌రిపింది.


సామ్రాట్

Next Story