ఆంధ్రప్రదేశ్‌కు ఏడుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులుగా అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కల గడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామ్ సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మీ నరసింహ, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ పేర్లను సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఈరోజు నిర్ణయం తీసుకుంది.
ఏడుగురు జ్యుడీషియల్ అధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు పని చేయాల్సి ఉంది. ప్రస్తుతం 24 మందే ఉన్నారు. 13 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఇందులో ఏడింటిని భర్తీ చేస్తూ సిఫారసులను జారీ చేసింది కొలీజియం.