స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అయితే కోర్టు సమయం ముగియడంతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. దీంతో రేపు వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. రేపు ఉదయం ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించనున్నారు.
ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని.. ఇది రాజకీయ కక్ష్య సాధింపు అని హరీష్ సాల్వే కోర్టులో వాదనలు వినిపించారు. సాల్వే సుదీర్ఘ వాదనల తరువాత రోహిత్గీ వాదనల గురించి కోర్టు ప్రశ్నించింది. రేపు (మంగళవారం) తన వాదనలు వినిపిస్తానని రోహిత్గీ చెప్పుకొచ్చారు. దీంతో మంగళవారం కోర్టు విచారణను కొనసాగించాలని నిర్ణయిస్తూ వాయిదా వేసింది.