మళ్లీ వాయిదా..!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.

By Medi Samrat  Published on  6 Dec 2023 8:15 PM IST
మళ్లీ వాయిదా..!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అలాగే ఉచిత ఇసుక కేసులోనూ చంద్రబాబు పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 12వ తేదీకే వాయిదా వేసింది. ఈ కేసులోనూ ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబు నాయుడు హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నవంబర్‌ 30న విచారణ జరగ్గా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ వాదనలు విన్న ధర్మాసనం తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. సీఐడీ తరఫున వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ సమయం కోరడంతో విచారణను డిసెంబర్‌ 6కు వాయిదా వేసింది హైకోర్టు. ఇప్పుడు తదుపరి విచారణను డిసెంబర్‌ 12కు వాయిదా వేసింది.

Next Story