వైసీపీ నేతల కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టినా వదలం : చంద్రబాబు

కొన్ని దుష్టశక్తు వారి రాజకీయ స్వలాభం కోసం సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.

By Medi Samrat  Published on  9 Nov 2024 2:45 PM GMT
వైసీపీ నేతల కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టినా వదలం : చంద్రబాబు

కొన్ని దుష్టశక్తు వారి రాజకీయ స్వలాభం కోసం సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైలం ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాజకీయ స్వలాభం కోసం సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడుతున్న వారిని వదిలి పెట్టమ‌ని హెచ్చ‌రించారు. ఐదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయింది.. ఏపీ బ్రాండ్ ను దెబ్బతీశారన్నారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారు.. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామ‌న్నారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెట్టినా వదలం.. ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. రౌడీయిజం చేస్తే సహించేది లేదు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామ‌ని హెచ్చ‌రించారు.

జగన్ కు తల్లి, చెల్లి అంటే గౌరవం లేదు.. మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయన్నారు. మృగాలను ఎలా నిలువరించాలో మాకు తెలుసు.. నా దగ్గర రౌడీలు, గూండాలు ఆటలు సాగవు అన్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే చర్యలు త‌ప్ప‌వ‌న్నారు. రౌడీలు, ఆంబోతులను కట్టడి చేస్తామ‌న్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. మా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ను ప్రభుత్వం పక్కాగా నిర్వహిస్తోందని తెలిపారు. తప్పును తప్పుగా చూస్తాం,, తప్పు చేసిన వాణ్ణి ఊరికే వదలమని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

Next Story