మంత్రులు అంతా వెర్రి పుష్పాలు : సోము వీర్రాజు

Somu Veerraju Fires On AP Govt. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమని అడుగుతుంటే అర్థం లేని మాటలు మాట్లాడుతూన్నారని

By Medi Samrat  Published on  9 Nov 2021 10:19 AM GMT
మంత్రులు అంతా వెర్రి పుష్పాలు : సోము వీర్రాజు

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమని అడుగుతుంటే అర్థం లేని మాటలు మాట్లాడుతూన్నారని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. భూతులు తిట్టే మంత్రులకు పద్మశ్రీ తరహాలోనే.. ఏపీలో అవార్డులు ఇవ్వాలని.. వెర్రి పుష్పాల అవార్డులు మంత్రులకు ఇవ్వాలని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సహాయం చేయడం కోసమే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింద‌ని.. బీజేపీ పెట్రోల్, డీజిల్ ఆదాయంగా మార్చుకుంటే.. సోలార్, ఎలక్ట్రానిక్ వాహనాలు ఎందుకు తయారు చేస్తామ‌ని ప్ర‌శ్నించారు.

ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలని అమలు చేయలేదని ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో మిమ్మల్ని దేకించామ‌ని.. డీపీవోలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచార‌ని.. బద్వేల్ ఉపఎన్నికపై చర్చకు సిద్ధమా అని స‌వాల్ విసిరారు. బీజేపీ తోక పార్టీ అయితే వైసీపీ ఏంటి? అని ప్ర‌శ్నించారు. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని మంత్రులు తెలుసు కోవాలని.. ఏపీ మంత్రులు భారతదేశంలో ఉన్నారా పాకిస్తాన్ లో ఉన్నారా? అని మండిప‌డ్డారు.

ధరలు తగ్గించమని ప్రశ్నిస్తే అసత్యాలతో ప్రకటన ఇస్తారా.. అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సమాధానం చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తే దివాలకోరు వ్యాఖ్యలు చేస్తారా అని నిల‌దీశారు. ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని.. న్యాయం చెయ్యమని అడిగితే పోలీసులతో కొట్టిస్తారా అని ప్ర‌శ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే మీపైనే పడుతుంద‌ని.. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై సీఎం, సీఎస్ కు లేఖ రాస్తామ‌ని తెలిపారు. డీజిల్, పెట్రోల్ కు పక్క రాష్ట్రానికి ఏపీకి 12 రూపాయల తేడా ఉందని అన్నారు.

ఛీప్ లిక్కర్ ను కూడా అధిక ధరకు ప్రభుత్వం అమ్మకాలు చేస్తుందని.. జగనన్న‌ కానుకలు అన్ని ప్రజలపై వేసిన భారాల నుంచి ఇస్తున్నవేన‌ని అన్నారు. మంత్రులు అంతా పచ్చ పుష్పాలు, వెర్రి పుష్పాలు అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రాజధాని ఇక్కడే ఉండాలని బీజేపీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని.. రాజధానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని ప్ర‌శ్నించారు. రాజధాని పేరు చెప్పి పన్నులు వసూలు చేస్తున్నారని.. బీజేపీ ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర ఏపీలో పోషిస్తుందని అన్నారు. రాజధాని రైతులను ఎందుకు నిరోధించాలని.. ప్రజాస్వామ్యంలో ఎవ్వరు ఉద్యమాలు చేసినా అడ్డుకోకూడదని అన్నారు. రైతులపై ప్రభుత్వం ఆంక్షలను బీజేపీ ఖండిస్తుందని.. బీజేపీ రూలింగ్ చేస్తుంది తప్ప.. బూమ్ బూమ్ బీర్లు తయారు చేయడం లేదని సోము వీర్రాజు అన్నారు.


Next Story