విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు

విశాఖపట్నం నగరంలోని ఓ హాస్పిటల్ లో స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat
Published on : 10 Dec 2024 9:30 PM IST

విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు

విశాఖపట్నం నగరంలోని ఓ హాస్పిటల్ లో స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకు గాయం తగిలిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అసభ్యంగా ప్రవర్తించిన స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన 3వ టౌన్ పోలీసులు సదరు స్కానింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పీఎన్‌సీ 74, 76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

Next Story