ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైఎస్సార్‌సీపీని బాగా ఆదరించారని అన్నారు. ఈ ఫలితంతో టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కౌంటింగ్‌లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశామని, ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో అయిపోయిద్ది అని అనుకోవద్దని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓట్లు వేసింది సమాజంలోని చిన్న సెక్షన్ మాత్రమే, ఇవి సొసైటీని రిప్రజెంట్ చేసేవి కావని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు. పీడీఎఫ్ ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టీడీపీకి వెళ్లాయని, టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదని.. ఈ ఫలితాలను మేము హెచ్చరిక గా భావించడం లేదన్నారు. మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్లలో ఎక్కువగా లేరన్నారు. యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీ చేశామన్నారు.