మంత్రి కేటీఆర్‌కు రేవంత్ ప్రశ్న.. చర్యలు ఉంటాయా.. మీరూ భాగస్వాములేనా.!?
Revanth Reddy Questions Minister KTR. ఉప్పల్ చౌరస్తా లోని నిర్మాణాలపై టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
By Medi Samrat Published on
18 Oct 2021 4:06 AM GMT

ఉప్పల్ చౌరస్తా లోని నిర్మాణాలపై టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అనుమతి లేని అక్రమ నిర్మాణాలపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ మంత్రి అండ.. ఉప్పల్ చౌరస్తాలో.. అనుమతి లేని అక్రమ నిర్మాణం.. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు.. మీ శాఖ బాగోతాల మీద చర్యలు ఉంటాయా..? లేదా మీరూ భాగస్వాములేనా.!? అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడియోను జతచేసి.. తెలంగాణ సీఎంఓ, జీహెచ్ఎంసీ కమిషనర్ కు టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Next Story