రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట..ఆ పదం తొలగింపు

అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By -  Knakam Karthik
Published on : 17 Sept 2025 2:17 PM IST

Andrapradesh, Amaravati, Ap Government, Farmers, Assigned Lands

అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయేకు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్‌లలో అసైన్డ్ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అసైన్డ్ అని ఉండటంతో తమ ప్లాట్‌లు అమ్ముడు పోవడం లేదని రైతులు ప్రభుత్వానికి తెలిపారు. అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని సీఎం సూచించారు. ఈ మేరకు బుధవారం ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్ ను మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 187 ను విడుదల చేసిన పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ విడుదల చేశారు.

Next Story