పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి కారణం అదే

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలల్లో పలు మార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఇది అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతూ ఉంది

By Medi Samrat
Published on : 20 April 2024 7:45 PM IST

పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి కారణం అదే

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలల్లో పలు మార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఇది అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతూ ఉంది. రెండ్రోజుల పాటు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన తీవ్ర జ్వరం కారణంగా వెంటనే హైదరాబాదు వెళ్లిపోయారు. ఇటీవల పిఠాపురం వచ్చి, చంద్రబాబుతో కలిసి ఉమ్మడి ప్రచార సభల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది.

రికరెంట్ ఇన్ ఫ్లుయెంజా కారణంగా పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ముతో బాధపడుతున్నారని ప్రకటన వచ్చింది. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఆయనకు జ్వరం వస్తోందని.. పవన్ పర్యటనల సందర్భంగా అభిమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన పార్టీ వివరించింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ లతో గజమాలలు వేయవద్దని జనసేన కోరింది. అదే విధంగా కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దని కోరారు. పూలు చల్లినప్పుడు ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story