ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న‌

Rain Alert For Andhra Pradesh. ఐఎండీ సూచనల ప్రకారం పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో

By Medi Samrat  Published on  10 July 2021 2:50 PM IST
ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న‌

ఐఎండీ సూచనల ప్రకారం పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్ర‌భావంతో తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వేగంతో గాలులు వీస్తాయ‌ని.. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు హెచ్చరిక చేశారు.

రాగల మూడు రోజుల వాతావరణ వివరాలు..

జూలై 10 శనివారం - ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం

జూలై 11 ఆదివారం - కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు..మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం

జూలై 12 సోమవారం - రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం. వ‌ర్షాల నేఫ‌థ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.


Next Story